ఏపీలో సోమవారం నుంచి ఆరో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. జూనియర్ కళాశాలలు మే 31వరకు 106 రోజులు పనిచేయనున్నాయి. వేసవి సెలవులు, రెండో శనివారం సెలవులను రద్దు చేశారు. సోమవారం నుంచి పదో తరగతికి ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20 వరకు బోధిస్తారు.
ఏపీలో నేటి నుంచి ఆరు, ఇంటర్ ప్రథమ తరగతులు ప్రారంభం - Inter first year Classes starts in ap
నేటి నుంచి ఏపీలో ఆరో తరగతి, ఇంటర్ మెుదటి సంవత్సరానికి తరగతులు పున:ప్రారంభంకానున్నాయి. సోమవారం నుంచి పదో తరగతికి ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20 వరకు బోధిస్తారు.
ఏపీలో నేటి నుంచి ఆరు, ఇంటర్ ప్రథమ తరగతులు ప్రారంభం
పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు జిల్లాల వారీగా జిల్లా విద్యాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పండుగల సెలవులు మినహా ఆదివారం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి :గురుకులాల్లో పీజీ కోర్సులు.. 2020-21 నుంచే ప్రారంభం