తెలంగాణ

telangana

ETV Bharat / city

Siro Survey: త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సీరో సర్వే - సీరో సర్వే వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో సీరో సర్వే చేయనున్నారు. కొవిడ్ వ్యాప్తి మూడోదశ హెచ్చరికల నేపథ్యంలో ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్ సీరో సర్వే చేయనుంది.

Siro Survey
సీరో సర్వే

By

Published : Aug 8, 2021, 2:39 PM IST

కొవిడ్ మూడోదశ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా త్వరలో సీరో సర్వే చేయనున్నారు. ఐసీఎంఆర్‌, ఎన్‌ఐఎన్ సీరో సర్వే చేయనుంది. ప్రజల్లోని వ్యాధి నిరోధక శక్తిని అంచనా వేసేందుకు ఎన్‌ఐఎన్‌(జాతీయ పోషకాహార సంస్థ), ఐసీఎంఆర్‌ భారీ ‘సీరో’ సర్వేకి సిద్ధమైంది. గతంలో చేసిన సర్వేలో దాదాపు 60 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్టు ఐసీఎంఆర్​ అనుబంధ సంస్థ ఎన్​ఐఎన్​ ప్రకటించింది. అయితే జాతీయ స్థాయిలో పోలిస్తే.. రాష్ట్రంలో 7 శాతం తక్కువగా సీరో పాజిటివిటీ నమోదైనట్లు తెలిపిన ఎన్​ఐఎన్​.. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో సత్ఫలితాలు వస్తున్నట్టు స్పష్టం చేసింది.

అయితే 6 నుంచి 9 ఏళ్ల లోపు 55 శాతం మందిలో మాత్రమే యాంటీబాడీలు గుర్తించారు. ఇక హెల్త్ కేర్ వర్కర్లలో ఏకంగా 82.4 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ముందుగా వ్యాక్సిన్ తీసుకోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చని.. అభిప్రాయపడింది. ఎన్​ఐఎన్​ గత నివేదిక ప్రకారం.. జనగామలో 58.76, నల్గొండలో 55.88, కామారెడ్డిలో అత్యధికంగా 65.61 శాతం మంది సీరో పాజిటివ్​గా గుర్తించారు. ఎన్‌ఐఎన్​లు గ్రామాల్లో ప్రజల వద్దకు వెెళ్లి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్​కు పంపిస్తారు. అక్కడ నమూనాలను పరీక్షించి యాంటీబాడిలు ఎంత శాతం ఉన్నాయో చెబుతారు. అందరి నమూనాలు సేకరించకుండా కాలనీలో ఒక్కరిద్దరి శాంపిల్స్​ కలెక్ట్​ చేస్తారు.

ఇదీ చదవండి: Bhongir Fort: అభివృద్ధికి నోచుకోని భువనగిరి కోట.. 'హామీలు మాటలకే పరిమితమా?'

ABOUT THE AUTHOR

...view details