తెలంగాణ

telangana

ETV Bharat / city

సింగరేణికి ఒడిశాలో "న్యూ పాత్రపాద" కేటాయింపు - odisha

సింగరేణి సిగలో మరో బొగ్గుబ్లాకు చేరింది. ఒడిశాలోని న్యూ పాత్రపాద బొగ్గుబ్లాకును కేంద్ర మంత్రిత్వశాఖ కేటాయించింది. వచ్చేఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సీఎండీ శ్రీధర్ వెల్లడించారు.

సింగరేణికి ఒడిశాలో మరో బొగ్గు బ్లాకు కేటాయింపు

By

Published : Sep 26, 2019, 7:38 PM IST

సింగరేణికి ఒడిశాలో మరో బొగ్గు బ్లాకు కేటాయింపు

సింగరేణికి ఒడిశాలోని న్యూ పాత్రపాద బొగ్గు బ్లాకు కేటాయించినట్లు సంస్థ సీఎండీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఇంతకుముందు కేటాయించిన నైనీ కంటే మూడు రెట్లు పెద్దదని ఆయన తెలిపారు. 1040 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న న్యూ పాత్రపాద నుంచి సంవత్సరానికి 200 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. వచ్చేఏడాది నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్ల వెల్లడించారు. ఒడిశాలోని బొగ్గు బ్లాకుల ద్వారా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఈ బొగ్గు బ్లాకును కేటాయించినందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖకు ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details