తెలంగాణ

telangana

ETV Bharat / city

Lockup Death Case: శీలం రంగయ్య ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకుంటారు..? - మంథని పోలీస్​స్టేషన్​

మంథని పోలీస్​స్టేషన్​లో ఆత్మహత్య చేసుకున్న శీలం రంగయ్య కేసు(Sheelam rangaiah Lockup Death Case)పై హైకోర్టులో విచారణ జరిగింది. రంగయ్య ఆత్మహత్యకు బాధ్యులపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Sheelam Rangaiah Lockup Death case hearing in high court
Sheelam Rangaiah Lockup Death case hearing in high court

By

Published : Nov 10, 2021, 10:18 PM IST

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్​స్టేషన్​లో నిందితుడు శీలం రంగయ్య ఆత్మహత్య(Sheelam rangaiah Lockup Death Case)కు బాధ్యులపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఓ చోరీ కేసులో అరెస్టయిన నిందితుడు శీలం రంగయ్య.. గతేడాది మే 20న సాయంత్రం 4 గంటలకు మంథని పీఎస్ లాకప్​లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులు భరించలేకే రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడని దివంగత న్యాయవాది పీవీ నాగమణి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ఈ పిల్​పై విచారణ చేపట్టింది. హైకోర్టు నియమించిన విచారణ అధికారి అంజనీ కుమార్ ఇప్పటికే నివేదిక సమర్పించారు. పిటిషనర్ నాగమణి హత్యకు గురైనందున.. అమికస్ క్యూరీగా నియమితులైన సీనియర్ న్యాయవాది దామోదర్ రెడ్డి ఘటన పూర్వాపరాలు వివరించారు. కస్టోడియల్ డెత్​కు బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపలి విచారణను డిసెంబరు 14కి వాయిదా వేసింది.

పోలీసుల పాత్ర లేదని నివేదిక..

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలోని బాత్​రూంలో ఆత్మహత్యకు పాల్పడిన శీలం రంగయ్య మృతిపై హైకోర్టు ఆదేశాల ప్రకారం హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ విచారణ చేశారు. రామగిరి మండలం బుధవారంపేట(రామయ్యపల్లికి)కు చెందిన రంగయ్య కుటుంబాన్ని సీపీ అంజనీకుమార్ విచారించారు. తనతో ఉన్న ఇద్దరు సహా నిందితులను కూడా విచారించారు. మంథని పోలీస్ స్టేషన్​లో రంగయ్య మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం చేసిన డాక్టర్లను విచారించిన సీపీ.. రంగయ్య మృతిలో పోలీసుల పాత్ర లేదని హైకోర్టుకు నివేదించారు. పూర్తి నివేదిక తెలుసుకోవాలంటే.. శీలం రంగయ్య మృతిపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన సీపీక్లిక్​ చేయండి.

సీపీ నివేదికపై నాగమణి అభ్యంతరం..

సీపీ అంజనీకుమార్​ సమర్పించిన నివేదికలో రంగయ్యది ఆత్మహత్యేనని పేర్కొనడంపై నాగమణి అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు అఫిడవిట్ దాఖలు చేస్తానని చెప్పారు. పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ప్రాణాలకు రక్షణకల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె... రామగుండం పోలీసులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కమిషనర్ సత్యనారాయణ సహా పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని... కేసు విచారణ పూర్తయ్యేవరకు బదిలీ చేయాలని కోరారు. అనంతరం.. నాగమణి దంపతులు హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఈ కేసుపై అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది దామోదర్ రెడ్డి నియమితులయ్యారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details