ఉద్యోగాలు వెతుక్కునే క్రమంలో ఉండే ఇబ్బందులు అన్నీఇన్ని కావు. మహిళలు కష్టపడి ఉద్యోగాలు సంపాదించినా.. పెళ్లయ్యాక పిల్లల బాధ్యత, కుటుంబ నిర్వహణ లాంటి రకరకాల కారణాలతో చేస్తున్న ఉద్యోగాలను కూడా మానేస్తుంటారు. అయితే.. పిల్లలు పెద్దయ్యాక మళ్లీ ఉద్యోగాలు చేయాలని ఉన్నా... ఇన్నేళ్ల గ్యాప్‌తో ఉద్యోగాలు దొరకని పరిస్థితి. ఒకవేళ దొరికే అవకాశమున్నా.. వెతుక్కునే మార్గం తెలియక అయోమయంలో ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న మహిళలకు మేమున్నామంటూ షీ జాబ్స్ స్టార్టప్ ముందుకొచ్చింది.
మహిళలకు ఉద్యోగాల కోసం ప్రత్యేక పోర్టల్.. శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్స్.. - షీ జాబ్స్ స్టార్టప్ కంపెనీ
ఉద్యోగ అన్వేషణలో ఎవరికైనా ఇబ్బందులు ఎక్కువే. ముఖ్యంగా మహిళలకు మరీ ఎక్కువ. కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నా... పెళ్లయ్యాక పిల్లల బాధ్యత, కుటుంబ నిర్వహణ ఇతర కారణాలతో చేస్తున్న ఉద్యోగాలు మానేయాల్సిన పరిస్థితి. అయితే పెళ్లాయ్యక కూడా ఉద్యోగాలు చేయాలనుకునే మహిళల కోసం మేమున్నామంటూ ముందుకొచ్చింది షీ జాబ్స్ స్టార్టప్ కంపెనీ. ప్రత్యేకంగా పెళ్లైనా మహిళల కోసం ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్న షీ జాబ్స్ వ్యవస్థపకురాలు స్వాతితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి..
ప్రత్యేకంగా మహిళల కోసం ఉద్యోగ అవకాశాలు ఇప్పటించడంతో పాటు... వారికి కావాల్సిన శిక్షణ ఉచితంగా ఇస్తు అండగా నిలుస్తోంది. రెండేండ్ల క్రితం అమెరికాలో షీ జాబ్స్ ఇన్ అనే స్టార్టప్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఇలాంటి సంస్థే హైదరాబాద్‌లో పెట్టి పలువురు మహిళలకు ఉద్యోగాలు ఇప్పించేందుకు తోడ్పటునిస్తున్నారు. రానున్నరోజుల్లో మరిన్ని దేశాలకు తమ సంస్థను విస్తరిస్తామని.. మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తమవంత కృషి చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పుడు ఐటీ రంగంలోనే ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తున్నామని.. రానున్న రోజుల్లో ఇతర రంగాల్లోనూ మహిళలకు ఉద్యోగ అవకాశాలు చూపుతామంటున్న షీ జాబ్స్ వ్యవస్థాపకురాలు స్వాతితో మరిన్ని ముచ్చట్లు...
ఇవీ చూడండి: