స్పెల్లింగులు నేర్పిస్తానని చెప్పి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ పాఠశాల డైరెక్టర్ దినేశ్ జోషి. గుజరాత్ రాజ్‌కోట్ లోధిక తాలుకాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దినేశ్ జోషి డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. స్పెల్లింగులు నేర్పిస్తానని ఇద్దరు విద్యార్థినులను తన గదికి పిలిచాడు. తన నిజస్వరూపం తెలియని చిన్నారులు ఆ గదికి వెళ్లగా.. అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
sexual harassment : స్పెల్లింగులు నేర్పిస్తానని విద్యార్థినులను గదిలోకి పిలిచి..! - అకృత్యాలు
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అకృత్యాలకు పాల్పడుతూ సభ్య సమాజానికి మచ్చ తెస్తున్నారు. కామంతో కళ్లు మూసుకున్న ఉపాధ్యాయులు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగింది.
sexual harassment
తన శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఓ బాలిక తన తల్లికి చెప్పుకుంది. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడని.. ఇతర అమ్మాయిలతోనూ ఇలాగే ప్రవర్తిస్తుంటాడని వాపోయింది. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు లోధిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జోషిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ఒక్కడే 75 మందిని పెళ్లాడి.. 200 మంది అమ్మాయిల్ని...