రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షలు ఏడో రోజు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉన్నందున మార్కెట్లకు పోటెత్తారు. పలు చోట్ల ప్రజలు కొవిడ్ నిబంధనలు మరిచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.
సడలింపు సమయంలో సందడి.. పది దాటగానే స్తబ్ధత - తెలంగాణ వ్యాప్తి 2021
తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలు ఏడో రోజు పటిష్ఠంగా అమలవుతున్నాయి. ఉదయం వేళ నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వచ్చారు. కొన్ని చోట్ల కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు.
లాక్‌డౌన్, తెలంగాణ లాక్‌డౌన్
ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారిపైకి వస్తే జరిమానా విధిస్తామని, వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.
- ఇదీ చదవండికరోనా మృత్యుకేళి- ఒక్కరోజే 4,329మంది బలి
Last Updated : May 18, 2021, 10:27 AM IST