తెలంగాణ

telangana

ETV Bharat / city

Suspension‌: సర్వీసు రివాల్వర్‌ మిస్సింగ్‌.. ఎస్‌ఐ సస్పెన్షన్‌ - Service revolver missing issue in tirumala

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్‌ పీఎస్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్​గా పనిచేస్తున్న జనార్దన్​ నాయుడికి సంబంధించిన సర్వీసు రివాల్వర్‌ కనిపించకపోవడంతో ఉన్నాతాధికారులు ఆయనను విధుల నుంచి తొలగించారు. బదిలీ అవుతున్న సమయంలో తుపాకీ అప్పగించకుండా రిలీవ్‌ అయినందుకు సంబంధిత ఎస్‌ఐపై అనంతపురం రేంజ్‌ డీఐజీ చర్యలు తీసుకున్నారు.

Service revolver missing Chittoor district
రివాల్వర్‌ మిస్సింగ్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సర్వీసు రివాల్వర్‌ మిస్సింగ్‌,

By

Published : Jun 25, 2021, 9:39 AM IST

ఏపీలో పుర, నగరపాలక సంస్థల ఎన్నికల సందర్భంగా.. అనంతపురం జిల్లా ధర్మవరం రూరల్‌ పీఎస్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న జనార్దన్‌ నాయుడిని తిరుపతి అర్బన్‌ జిల్లా తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ధర్మవరం రూరల్‌ పీఎస్‌లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐకి సర్వీసు రివాల్వర్‌ అందకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీఐజీ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో తుపాకి అప్పగించలేదని... రికార్డుల్లో నమోదు చేయలేదని తేలింది. స్టేషన్‌లో కూడా తుపాకీ లేదని నిర్ధరణ అయింది. జనార్దన్‌ నాయుడిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అనంతపురం జిల్లా క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా జనార్దన్‌ నాయుడు పనిచేసే సమయంలో కీలకమైన కేసులను ఛేదించారు. వారి నుంచి ఎస్‌ఐకి ప్రాణహాని ఉండటంతో సొంత తుపాకీ అనుమతులు తీసుకుని వినియోగించారు. అక్కడ నుంచి ధర్మవరం రూరల్‌కు మారినప్పుడు అదే తుపాకీ వినియోగిస్తూ వచ్చారు. తిరుపతికి బదిలీ కావడంతో అలాగే వచ్చి విధుల్లో చేరిపోయారు. ధర్మవరం రూరల్‌లో ఉన్నంతకాలం సర్వీసు రివాల్వర్‌ తీసుకోవడం... అప్పగించే విషయంలో అలసత్వం ప్రదర్శించినందుకు చర్యలు చేపట్టారు. కనిపించని తుపాకీ కోసం దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'

ABOUT THE AUTHOR

...view details