శివునికి ఎంతో ఇష్టమైన కార్తికమాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయాలన్నీ మార్మోగాయి.
శేరిలింగంపల్లిలో వెల్లువిరిసి ఆధ్యాత్మిక శోభ - latest news of kartika pournami
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని శేరిలింగంపల్లిలోని ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి.
శేరిలింగంపల్లిలో వెల్లువిరిసి ఆధ్యాత్మిక శోభ
ఉదయం నుంచే భక్తులు దైవదర్శనం కోసం బారులు తీరారు. మహిళలు ఆలయాలలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి లక్ష బిల్వార్చన, కుంకుమార్చన, పాలాభిషేకం నిర్వహిచారు.
ఇదీ చూడండి:శివాలయాల్లో కార్తిక సోమవార ప్రత్యేక పూజలు