ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలను సోమవారం అందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. సమ్మెకాలం వేతనాన్ని ఏకమొత్తంలో అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి నిర్వహించిన నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వరాలు ప్రకటించారు.
సమ్మెకాలం వేతనాలు ఏకమొత్తంలో ఇస్తాం...
52 రోజులు సమ్మె కాలం జీతాన్ని ఆర్టీసీ కార్మికులకు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వీటితోపాటు ఆర్టీసీ మహిళా కార్మికులకు సౌకర్యాల కల్పనతోపాటు ప్రసూతి సెలవులకు వేతనాలు ఇస్తామని చెప్పారు. ఇకపై ప్రభుత్వానికి అధికారులకు ఈ సభ్యులు వారధిగా ఉండాలని సూచించారు. కార్మికులంతా ఆర్టీసీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని.. ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.