తెలంగాణ

telangana

ETV Bharat / city

విజయవాడలో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

ఏపీలో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. రామతీర్థం, రామమహేంద్రవరం ఘటనలు మరువక ముందే.. విజయవాడలో మరో మందిరంలో విగ్రహం ధ్వంసం చేశారు. సీతమ్మవారి మట్టి విగ్రహం విరిగిపోవడంపై తెలుగుదేశం, భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

ap crime news
విజయవాడలో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

By

Published : Jan 3, 2021, 1:55 PM IST

విజయవాడలో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్దనున్న సీతారామ మందిరంలో... సీతమ్మ విగ్రహం ధ్వంసం చేశారు. ఆటో స్టాండ్ సమీపంలోనే ఉన్న గుడిలో... విగ్రహం కిందపడి పగిలిపోయి ఉంది. ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? అన్నది తెలియడం లేదు. ఆరుబయట ఉన్న ఆలయంలో పిల్లులు తిరుగుతుంటాయి. పిల్లులు తోయడం వల్ల విగ్రహం కిందపడిందా? అనే అనుమానమూ వ్యక్తమవుతోంది. సమాచారం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే ఏపీలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం ఆరోపించింది. హత్యా రాజకీయాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఏపీ ప్రభుత్వం పథకం ప్రకారం ఈ ఘటనలు చేయిస్తోందని.. మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఆలయం ఎదుట తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. ఎలుకలు విగ్రహాన్ని పడేసి ఉంటాయన్న పోలీసుల వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత పట్టాభి మండిపడ్డారు.

సీతారామమందిరంలో విగ్రహం ధ్వంసంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలించి ఘటనకు కారణాలు తెలుసుకుంటామన్నారు. చిన్న జంతువులు ఏమైనా విగ్రహాన్ని పడేసి ఉండొచ్చేమోనన్న అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తామన్నారు.


ఇవీచూడండి:ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details