రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు - సచివాలయం కూల్చివేత
07:32 July 08
రెండో రోజు కొనసాగుతున్న సచివాలయం కూల్చివేత పనులు
వరుసగా రెండో రోజు సచివాలయం భవనాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ప్రొక్లెయినర్లు, భారీ యంత్రాలతో అధికారుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సచివాలయం చుట్టూ ఉన్న మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
సచివాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. భారీ బందోబస్తు నడుమ కొనసాగుతున్న కూల్చివేతల పనులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సచివాలయంలోని అన్ని బ్లాకులు కూల్చివేసి... శిథిలాలు తరలించే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.