తెలంగాణ

telangana

ETV Bharat / city

జింకల మారణకాండపై కొనసాగుతున్న విచారణ.. నిందితులెవరో? - enquiry in deer killing case at adoni

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో జింకల హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే నిందితుల ఆచూకీ కనుగొని.. వన్యప్రాణుల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

జింకల మారణకాండపై కొనసాగుతున్న విచారణ.. నిందితులెవరో?
జింకల మారణకాండపై కొనసాగుతున్న విచారణ.. నిందితులెవరో?

By

Published : Mar 9, 2022, 3:30 AM IST

ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామ పొలాల్లో జింకల మారణకాండపై విజిలెన్స్‌ అధికారి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. రెండు రోజుల క్రితం గ్రామ పొలాల్లో 11 జింకల కళేబరాలు వెలుగు చూశాయి. దాదాపు 11 జింకలను గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి వాటి తలలను వదిలేసి చర్మం, మాంసం ఎత్తికెళ్లిన ఘటన తెలిసిందే. దీంతో ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నట్లు గోపీనాథ్‌ తెలిపారు.

ఘటనపై చుట్టుపక్కల పొలాల రైతులతోపాటు గ్రామస్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అన్ని చెక్‌పోస్టులను అప్రమత్తం చేయడంతోపాటు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ వినోద్‌ కుమార్‌, అటవీశాఖ డివిజన్‌ అధికారి సుదర్శన్‌, తాలూకా సీఐ పార్థసారధి తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details