మినీ పురపోరు పోలింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆయన... సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్లతో సంప్రదించి కొవిడ్ నిబంధనలకు లోబడి ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నల్గొండ, పరకాల, బోధన్, మెట్పల్లిలో ఒక్కో వార్డుకు కూడా ఆ రోజు ఉపఎన్నికలు జరగనున్నాయి.
'మినీ పోల్స్‌కు కొవిడ్ నిబంధనలకు లోబడి పకడ్బందీ ఏర్పాట్లు'
మినీ పురపోరు పోలింగ్ ఏర్పాట్లపై పోలింగ్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్లతో సంప్రదించి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.
మొత్తం 11 చోట్లా కలిపి 11,34,032 మంది ఓటర్లున్నారు. ఓటింగ్ కోసం 1539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9809 మంది సిబ్బందిని పోలింగ్‌కు వినియోగించనున్నారు. మొత్తం 676 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. వరంగల్‌లో 354, ఖమ్మంలో 192, సిద్దిపేటలో 58, నకిరేకల్‌లో 40, జడ్చర్లలో 20, కొత్తూరులో 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. పోలింగ్ కోసం 2500 బ్యాలెట్ బాక్సులు వినియోగించనున్నారు. 872 కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తారు. 373 కేంద్రాల్లో మైక్రో అబ్జార్వర్లు ఉంటారు. మిగతా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వీడియోగ్రఫీ చేయిస్తారు.