తెలంగాణ

telangana

ETV Bharat / city

గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ బహిర్గతం: హైకోర్టులో విచారణ

గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ బహిర్గతంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. లేఖ బహిర్గతంపై సీబీఐ విచారణ జరపాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోరారు. ఎస్‌ఈసీ తరఫున వాదనలు పూర్తవగా... తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.

ap sec
గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ బహిర్గతం: హైకోర్టులో విచారణ

By

Published : Mar 31, 2021, 10:09 PM IST

తనకు రాష్ట్ర గవర్నర్​కు మధ్య జరిగిన ప్రత్యేక (ప్రివిలేజ్) సమాచారం ఉత్తరప్రత్యుత్తురాల వివరాలు బయటకు వెల్లడికావడం (లీక్)పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని... ఏపీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ కొద్ది రోజుల కిందట హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యవహారంపై మధ్యంతర నివేదికను 72 గంటల్లో కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. సమాచారం లీక్ కావడంపై గవర్నర్ ముఖ్యకార్యదర్శి విచారణ జరిపించడంలో విఫలమవ్వడాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్​లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్యకార్యదర్శి, సీడీఐ డైరెక్టర్​తో పాటు మంత్రులు రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

అధికరణ 243 (బి) (3) ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా గవర్నర్.. ఎన్నికల సంఘానికి సదుపాయాలు కల్పించాలి. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండటంతో సమస్యల పరిష్కారానికి గోప్యమైన లేఖల ద్వారా పలుమార్లు గవర్నర్‌ను కలిశాను. ఆ లేఖలు రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరిగే ప్రత్యేక ఉత్తర ప్రత్యుత్తరాలు. అందులో గవర్నర్ పరిష్కరించాల్సిన అంశాలుంటాయి. వాటిని సాధారణ ప్రజానీకానికి, మీడియాకు లీక్ చేయడానికి వీల్లేదు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని బయటకు తెస్తూనే ఉన్నారు. లీక్ కావడంపై దర్యాప్తు జరపాలని సీఎస్, గవర్నర్ ముఖ్యకార్యదర్శిని కోరా. చర్యలు తీసుకోవడంలో వారు విఫలమయ్యారు. ఆశ్చర్యం కలిగించే రీతిలో శాసనసభ కార్యదర్శి నుంచి ఈనెల 18న ఓ లేఖను అందుకున్నా. నాకు, గవర్నర్​కు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తర విషయంలో మంత్రులు రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. లీక్ కారణంగా మంత్రులిద్దరు స్పీకర్​కు లేఖలు సమర్పించి... వారి ప్రతిష్ఠకు భంగం కలిగినట్లు అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసు పంపుతూ.. వివరణ ఇవ్వాలని, అవసరం అయితే హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -నిమ్మగడ్డ రమేశ్​కుమార్, ఏపీ ఎస్​ఈసీ

లేఖ బహిర్గతంపై సీబీఐ విచారణ జరపాలని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది కోరారు. ఎస్‌ఈసీ తరఫున వాదనలు పూర్తవగా... తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.

ఇదీ చదవండి: రాష్ట్రానికి 12 జాతీయ పంచాయతీరాజ్​ అవార్డులు

ABOUT THE AUTHOR

...view details