తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో తెలంగాణ మద్యం పట్టివేత.. - AP S EB Police latest news

అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని ఏపీ ఎస్​ఈబీ అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారంతో గుంటూరు జిల్లా నగరం మండలంలో దాడులు నిర్వహించినట్లు చెప్పారు. 140 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని.. కారు సీజ్ చేశామని వెల్లడించారు.

ఏపీలో తెలంగాణ మద్యం పట్టివేత.. 140 బాటిళ్లు స్వాధీనం
ఏపీలో తెలంగాణ మద్యం పట్టివేత.. 140 బాటిళ్లు స్వాధీనం

By

Published : Mar 23, 2021, 4:34 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా నగరం మండలంలో అక్రమంగా తెలంగాణ మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. వారి వద్ద 140 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని.. రవాణాకు వినియోగించిన కారును సీజ్ చేశామని చెప్పారు.

పట్టుపడిన వారిపై కేసు నమోదు చేసినట్లు నగరం, నిజాంపట్నం మండలాల ఎస్​ఈబీ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ధూలిపూడి సమీపంలోని దుకాణంలో అమ్మేందుకు మద్యాన్ని తీసుకువస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించినట్లు చెప్పారు.

మద్యం అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టుతో పాటు కొనుగోలు చేస్తున్న మరో మహిళను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అక్రమ మద్యం తరలింపు, నాటు సారా తయారీ, అమ్మకాలు వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అనధికారిక అమ్మకాలపై సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఇదీ చదవండి:'ఐఓటీ'.. భారీ సంఖ్యలో ఉద్యోగాలు క‌ల్పించే టెక్నాల‌జీ

ABOUT THE AUTHOR

...view details