బడిగంటలు మోగాయి(Schools Reopened). పాఠశాలల్లో విద్యార్థుల సందడి మొదలైంది. దాదాపు 16 నెలల అనంతరం పునఃప్రారంభమైన పాఠశాలలకు తొలిరోజు 21.77శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ బడుల్లో 27.45, ప్రైవేట్ బడుల్లో 18.35 శాతం హాజరు నమోదయింది. జూనియర్ కళాశాలల్లో 15 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు పిల్లలందరిని మాస్క్ తప్పనిసరిగా ధరించేలా చూశారు. హాజరు సంఖ్య తక్కువే కావడంతో.. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించి... అక్కడ మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మూత్రశాలలు పరిశీలించారు. తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. చిన్నపిల్లలకు శానిటైజర్ వాడకాన్ని వివరించారు.
విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలి
పాఠశాలల్లో కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రిన్సిపాళ్లకు, డీఈవోలకు చెప్పామని మంత్రి తెలిపారు. జులై నుంచి నేటి వరకు ఒకటవ తరగతిలోనే సుమారు 1.25 లక్షల మంది విద్యార్థులు చేరారన్నారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల వరకు విద్యార్థుల ఉంటారని.. అందులో 30శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే వారే ఉన్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు.. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమయంలో కచ్చితంగా వెన్నంటి ఉండి చేతులు శుభ్రంగా కడుక్కునేలా చూడాలన్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించాలి