సుదీర్ఘ లాక్‌డౌన్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించటంతోపాటు... ప్రభుత్వం అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.
నవంబర్ 2 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వరకున్న పనిదినాల్లో 144 రోజులు బడుల్లోనే బోధిస్తారు. మిగిలిన ఆదివారాలు, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులు ఇళ్ల వద్దే చదువుకుంటారు. ప్రైవేటు స్కూళ్లలో ఈసారి 30శాతం తక్కువ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.