ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. సాధారణ పనివేళల్లోనే పాఠశాలలు నడుస్తాయని మంత్రి వెల్లడించారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే 95 శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన వారికి కూడా టీకాలు వేయాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.
SCHOOLS REOPEN: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 16 నుంచి పాఠశాలల పున: ప్రారంభం - ap news
ఏపీలో ఈనెల 16 పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలపై జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
పాఠశాలలు పునఃప్రారంభం
రాష్ట్రంలో ఎక్కడా ఆన్‌లైన్ తరగతులు జరగట్లేదని.. ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్ తరగతులు వద్దని ఆదేశించినట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి ఆఫ్‌లైన్‌లోనే పాఠశాలలను నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:8 ఏళ్ల బాలుడు.. అర్ధరాత్రి సైకిల్‌పై 92 కి.మీ... చివరకు...
Last Updated : Aug 10, 2021, 4:58 PM IST