తెలంగాణ

telangana

ETV Bharat / city

సిస్టర్ నివేదిత పాఠశాల ఎదుట మరోసారి ఉద్రిక్తత - sister nivedita school

ఈ నెల 3న హైదరాబాద్​ అమీర్​పేటలోని సిస్టర్​ నివేదిత పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తుది నిర్ణయాన్ని ఈరోజు చెబుతామని ఇప్పడు మళ్లీ 13వ తేదీకి వాయిదా వేసింది పాఠశాల యాజమాన్యం. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.

పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా

By

Published : Apr 8, 2019, 8:29 PM IST

హైదరాబాద్​ అమీర్​పేటలోని సిస్టర్​ నివేదిత పాఠశాలలో అధిక ఫీజు వసూలు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక కార్పొరేటర్​ కుమార్​తో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 3న ఫీజు పెంపుపై ఆందోళన చేపడితే... ఈరోజు నిర్ణయాన్ని చెబుతామన్న యాజమాన్యం ఇప్పుడు మళ్లీ 13వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలపై జిల్లా విద్యాశాఖాధికారి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా

నచ్చకుంటే టీసీలు తీసుకోండి

ఫీజు పెంపుపై ప్రశ్నిస్తే టీసీ తీసుకుని వెళ్లిపోమంటున్నారు కానీ... సరైన వివరణ ఇవ్వట్లేదని తల్లిదండ్రులు అన్నారు. పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని... బడిలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండిః 'పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'

ABOUT THE AUTHOR

...view details