Half day schools In Telangana : రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలల్లో తరగతులు కొనసాగుతాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు.
Half day schools In Telangana: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటిపూట బడులు - school education in telangana
Half day schools In Telangana: రాష్ట్రంలో రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
half day schools in telangana
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు.. ఈ విద్యాసంవత్సరం ముగిసే వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. 12.30 గంటలకే మధ్యాహ్న భోజనం పెట్టాలని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని వెల్లడించారు.