హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రాంగణంలో బైఠాయించి సంచాలకుని తీరుపై నిరనన తెలిపారు. సరైన శిక్షణ ఇవ్వడం లేదని.. మౌలిక సదుపాయాలు సరిగా లేవని ఆరోపించారు. విద్యార్థిని, విద్యార్థుల పట్ల స్టడీ సర్కిల్ సంచాలకుల తీరు అభ్యంతరకంగా ఉందంటూ వాపోయారు. నిత్యం కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 45 రోజులు గడిచినా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదంటున్న విద్యార్థులతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి..
సంచాలకుని తీరుపై ఎస్సీ స్టడీసర్కిల్ విద్యార్థుల ఆందోళన
బంజారాహిల్స్‌లోని ఎస్సీ స్టడీ సర్కిల్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థినులతో సంచాలకుడు అభ్యంతరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంచాలకుని తీరుపై ఎస్సీ స్టడీసర్కిల్ విద్యార్థుల ఆందోళన