ఓటుకు నోటు కేసు నుంచి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యను తొలగించేందుకు అనిశా న్యాయస్థానం నిరాకరించింది. సండ్ర వెంకట వీరయ్య, మరో నిందితుడు ఉదయ్ సింహా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.
ఓటుకు నోటు కేసులో సండ్రకు లభించని ఊరట
ఓటుకు నోటు కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేసిన పిటిషన్ను అనిశా న్యాయస్థానం నిరాకరించింది. అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు ఓటుకు నోటు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని.. అనవసరంగా తనను దీనిలో ఇరికించారని సండ్ర వాదించగా.. ఆయన పాత్ర, ప్రమేయంపై ఆధారాలున్నాయని ఏసీబీ తెలిపింది. ఉదయ్సింహాకు సంబంధం ఉన్నట్లు కూడా తగిన సాక్ష్యాలున్నాయని పేర్కొంది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్సింహా డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేసింది. అభియోగాల నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు ఓటుకు నోటు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ కోర్టు ముందు హాజరయ్యారు.
ఇదీ చూడండి:ఓటుకు నోటు కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై ముగిసిన వాదనలు