తెలంగాణ

telangana

ETV Bharat / city

షాకింగ్​.. హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్​! 'యశోద' కోసం!! - SAMANTHA PREGNANT

samantha pregnant: టాలీవుడ్​ బ్యూటీ సమంత గతేడాది యువ హీరో అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె సినిమా కెరీర్​ పై కంటే.. జీవితంపై ఎక్కువ వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటువంటి వార్తే ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

SAMANTHA PREGNANT IN YASHODA
SAMANTHA PREGNANT IN YASHODA

By

Published : Jan 18, 2022, 7:26 PM IST

samantha pregnant: టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత సరికొత్త సినిమాలు, విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నారు. ఏకంగా నాలుగు సినిమాలను చేతిలో ఉంచుకొని.. ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. అయితే ముందుగా ఈ భామ యశోద చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​ మారింది. అదే సమంత ప్రెగ్నెంట్​ అని.


ఈ వార్త నిజమే అని చిత్ర యూనిట్​ చెప్పినట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిని చిత్ర బృందం కూడా కొట్టేయలేదు. అసలు విషయం ఏమింటంటే ఈ అమ్మడు యశోద అనే సినిమాలో ప్రెగ్నెంట్​ క్యారెక్టర్​లో కనిపించనున్నట్లు ఫిలింనగర్​లో టాక్​ వినిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్​ ఫిల్మ్​గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నర్స్​ పాత్రలో మెరుస్తున్న శ్యామ్​... ప్రెగ్నెంట్​గా కనిపించి ప్రేక్షకాదరణ పొందాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్​లో ఆసుపత్రి సెట్​ను కూడా వేశారు. దీనిలోనే ఈ చిత్రం రెగ్యులర్​ మొదటి షెడ్యూల్​ పూర్తి అయ్యింది.


ఇదీ చూడండి: బికినీలో అందాలు ఆరబోస్తూ.. హాట్​హాట్​గా

ABOUT THE AUTHOR

...view details