తెదేపా అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. తన పర్యటనల్లో ప్రజలను చంద్రబాబు ఘోరంగా అవమానిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ముందు అసభ్యంగా, బూతులు ఉపయోగిస్తూ చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే అధికారం రాదనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. నాన్ బెయిలబుల్ కేసు పెట్టేంతగా ఏపీ ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని సజ్జల ఆరోపించారు.
ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని ఆయన వ్యవహారశైలిలో విపరీత ధోరణి కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కొద్ది రోజులు ఆగిందని.. నిర్ణయం మాత్రం మారదని స్పష్టం చేశారు.
ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ ఖచ్చితంగా జరుగుతుందన్న సజ్జల.. మూడు రాజధానుల ఏర్పాటులో కొద్ది రోజులు ఆలస్యం తప్ప నిర్ణయం ఆగదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సజ్జల అన్నారు.