కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులతో పోలిస్తే.. ఏపీ సీఎం జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏపాటివని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొవిడ్ సమయంలో భారీ స్థాయిలో కేంద్రం అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు సైతం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా అప్పులు చేశాయని స్పష్టం చేశారు. జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని భాజపా దుష్ప్రచారం చేస్తోందని.. ఈ ప్రచారాన్ని పార్టీ నేతలు తిప్పికొట్టాలని సూచించారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఆర్య వైశ్య నేతల తో సమావేశం లో సజ్జల పాల్గొన్నారు.
sajjala on bjp: వారితో పోలిస్తే మేము చేసింది చాలా తక్కువ: సజ్జల
ఏపీ సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని భాజపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ ప్రచారాన్ని వైకాపా కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం చేసిన అప్పులతో పోలిస్తే.. రాష్ట్రం చేసింది చాలా తక్కువ అని సజ్జల చెప్పారు.
జనాల జేబుల్లో డబ్బు ఉంటేనే కొనుగోళ్లు పెరిగి.. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ బలోపేతమవుతుందనే నమ్మకంతో సీఎం జగన్.. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో లక్ష కోట్లు పైగా డబ్బును జమచేస్తున్నట్లు తెలిపారు. తెచ్చే ప్రతి పైసా అప్పునూ సద్వినియోగం చేస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ అనుసరించే మత విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని దుష్ప్రచారం చేసేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో మత విశ్వాసాలు, ఆర్ధిక పరమైన అంశాలే అజెండాగా దాడి జరగబోతోందని అనుమానం వ్యక్తం చేశారు. వాటిని తిప్పికొట్టేందుకు వైకాపా నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.
ఇదీ చదవండి: