తెలంగాణ

telangana

ETV Bharat / city

వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న 300 మంది..

SADDULA BATHUKAMMA CELEBRATIONS: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు.. సంతోషంగా ఆడిపాడారు.

SADDULA BATHUKAMMA CELEBRATIONS
సద్దుల బతుకమ్మ వేడుకలు

By

Published : Oct 4, 2022, 12:15 PM IST

హైదరాబాద్​లో సద్దుల బతుకమ్మ సంబరాలు

SADDULA BATHUKAMMA CELEBRATIONS: సద్దుల బతుకమ్మ వేడుకలను హైదరాబాద్​ నగరంలో ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ చుట్టూ చేరి మహిళలంతా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆహ్లాదకరంగా గడిపారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులు ఎంతో ఉల్లాసంగా ఆడిపాడారు. సద్దుల బతుకమ్మ వేడుకల వేళ మహా నగరంలోని రోడ్లన్నీ పూలవనంలా మారిపోయాయి.

నగరంలోని అన్ని ప్రాంతాలు బతుకమ్మ సంబురాల్లో మునిగిపోయాయి. హైదరాబాద్​లోని శారదానగర్ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, వెల్ఫేర్​ అసోసియేషన్, కళాభారతి సాంస్కృత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు వైభవంగా సాగాయి. చిన్నా పెద్దా అనే తేడాలేకుండా సుమారు 300 మంది వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలను నృత్యాలు చేస్తూ సంతోషంగా గడిపారు. అనంతరం పోయి రా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా అంటూ నిమజ్జనం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details