అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలను కలిశామని... అందరూ తమకు మద్దతు ప్రకటించారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తామన్నారు. సమ్మె పాక్షికమే అన్న ప్రచారాలను తాము ఖండిస్తున్నామన్నారు. తాను ఉద్యోగులను విమర్శించానన్న వార్తలు అవాస్తవమని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరును అన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాలని కోరారు. నిన్న, ఇవాళ ఎన్ని కిలోమీటర్లు బస్సులు నడిపారో ఎంత మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి అధికారులు వాస్తవ పరిస్థితులను చెప్పాలని అశ్వత్థామ రెడ్డి కోరారు.
సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తాం: అశ్వత్థామ రెడ్డి - tsrtc strike update
సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రికి అధికారులు వాస్తవ పరిస్థితులను వివరించి కార్మికుల సమస్యలను పరిష్కరించేలా చూడాలని ఆయన కోరారు.
సమ్మెను ఇంకా ఉద్ధృతం చేస్తాం: అశ్వత్థామ రెడ్డి