ఇసుక రీచ్‌లు సబ్ లీజుకు ఇప్పిస్తానని ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వాసి సతీశ్ ఘరానా మోసానికి తెరలేపాడు. రీచ్‌లు కట్టబెటతామని పలువురి నుంచి రూ.3.5 కోట్లు వసూలు చేశారు. ఈ క్రమంలో గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించాడు. గోపాలకృష్ణ ద్వివేది సంతకం ఫోర్జరీ చేసిన సతీశ్... సంబంధించిన దస్త్రాలను సైతం ఏర్పాటు చేశాడు.
సబ్ రీచ్‌లు ఇప్పిస్తానని..
ఏపీలోని కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ తనకు జేపీ గ్రూప్ నుంచి ఇసుక రీచ్‌ల కాంట్రాక్ట్ వచ్చిందని నమ్మిస్తూ పలువురి నుంచి భారీగా నగదు వసూలు చేశాడు. ఇసుక రీచ్‌లను సబ్ లీజ్‌కు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవటంతో.. బాధితులు విషయాన్ని జేపీ గ్రూప్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఫోర్జరీ అని గుర్తించారు..