హైదరాబాద్లోని రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతోంది. ట్రాఫిక్ నియంత్రణ, వాహనదారుల్లో అవగాహన కోసం హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక చర్యలతో ప్రయోజనం కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 13 శాతం తగ్గాయి. మృతుల సంఖ్య 11 శాతం తగ్గింది. చనిపోయిన పాదచారుల సంఖ్య కూడా 17 శాతానికి తగ్గింది.
పోలీసుల శ్రమ ఫలించింది... రోడ్డు ప్రమాదాలు తగ్గాయి!
ట్రాఫిక్ పోలీసుల ప్రయత్నం ఫలిస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు వారు చేస్తున్న కృషి ఫలిస్తోంది. గతేడాదితో పోలిస్తే ప్రమాదాలతోపాటు మృతుల సంఖ్య తగ్గింది.
జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు 80 బ్లాక్ హోల్స్ గుర్తించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వెయ్యికి పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ చర్యలతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి.
ఇవీ చూడండి: మేఘ కృష్ణారెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ సోదాలు