కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా ఉన్న అవరోధాలను అధిగమించే దిశగా కేంద్ర జల్‌శక్తి శాఖ చర్యలు ప్రారంభించింది. అమలు పురోగతిని బోర్డుల ఛైర్మన్లతో సమీక్షించింది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్, జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో జలశక్తి శాఖ ఉన్నతాధికారులు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. ఇప్పటివరకు జరిగిన కసరత్తు, పురోగతిని ఆరా తీసినట్లు సమాచారం.
Review on Gazette Implementation : గెజిట్ అమలుపై జల్‌శక్తి ఉన్నతాధికారుల సమీక్ష! - గెజిట్ అమలుపై జల్‌శక్తి సమీక్ష
కేంద్రం జారీ చేసిన గెజిట్ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల ఉన్నతాధికారులతో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు గురువారం ఆన్‌లైన్‌లో సమీక్షించినట్లు తెలిసింది. బోర్డు సమావేశాల్లో ఖరారు చేసిన ప్రాజెక్టులను 14వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాల్సి ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలను బోర్డులు రెండు ప్రభుత్వాలకు అందజేశాయి. ఈ ప్రక్రియలో ఎటువంటి ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో గెజిట్ అమలుపై నెలకొన్న ప్రతిష్ఠంభనను బోర్డులు కేంద్రానికి నివేదించాయి.
Review on Gazette Implementation
బోర్డుల ప్రతిపాదనలు, రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అభిప్రాయాలు, స్పందనలను బోర్డుల ఛైర్మన్లు కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. ఈ నెల 14 నుంచి గెజిట్ అమల్లోకి వచ్చినప్పటికీ ఒక్క ప్రాజెక్టును కూడా తమకు అప్పగించలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంజినీర్లు, అధికారుల బృందాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ రెండు రాష్ట్రాలకు పంపే అవకాశం ఉందని అంటున్నారు.