అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు ఎంపీ రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు.
'ఓటుకు నోటు కేసు అ.ని.శా. కోర్టు పరిధిలోకి రాదు' - revanth reddy's vote for note case
ఓటుకు నోటు కేసు ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కాబట్టి ఎన్నికల ట్రైబ్యునల్ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి అనిశా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై మంగళవారం రోజున విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
అనిశా కోర్టులో రేవంత్ ఓటుకు నోటు కేసు
నోటుకు ఓటు కేసు అనిశా కోర్టు పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్పై విచారణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కాబట్టి.. ఎన్నికల ట్రైబ్యునల్ విచారించాలని రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది కోర్టును కోరారు. రేవంత్ పిటిషన్పై మంగళవారం రోజున వాదనలు కొనసాగిస్తామని అనిశా కోర్టు స్పష్టం చేసింది.