తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఫిరాయింపుల రోగానికి మునుగోడులో విజయంతో చెక్ పెడదాం' - మునుగోడు ఉప ఎన్నిక

Revanth reddy on munugodu: మునుగోడు ఉప ఎన్నిక వ్యూహంపై కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థిని ప్రకటించిన హస్తం పార్టీ .. ఇప్పుడు ప్రచారంపై దృష్టి సారించింది. ప్రచారసరళిని పర్యవేక్షించేందుకు ప్రతి రెండు గ్రామాలకు ఒక్కరు లెక్కన 150 మందిని నియమించింది. ఈనెల 18 నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు పీసీసీ నేతలు కార్యకర్తలకు తెలిపారు.

TPCC President Revanth Reddy
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి

By

Published : Sep 13, 2022, 5:58 PM IST

Updated : Sep 13, 2022, 6:57 PM IST

Revanth reddy on munugodu: తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో నేతలకు ఫిరాయింపుల రోగం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలు ఫిరాయించే ఈ కాలంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్న మిత్రులందరికి అభినందనలు తెలిపారు. గతంలో నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా పార్టీ ఫిరాయించారని... ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఫిరాయించారని కాంగ్రెస్ అయనకు టికెట్‌ ఇవ్వలేదా ఇవ్వనందా అని ప్రశ్నించారు.

చౌటుప్పల్‌ బాలాజీ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ సమన్వయ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో మాణిక్కమ్‌ ఠాగూర్‌తోపాటు రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో నాయకులమంతా గడపగడపకు తిరుగుతామని...అక్కడ కాంగ్రెస్ గెలవాల్సిన చారిత్రక అవసరం ఉందని తెలిపారు. కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని...ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే వాళ్ల మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రెడ్డి, గీతారెడ్డి తదతర నేతలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 13, 2022, 6:57 PM IST

ABOUT THE AUTHOR

...view details