తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్ర ఎన్నికల  సంఘానికి రేవంత్​ రెడ్డి ఫిర్యాదు

ప్రచారానికి అధికార యంత్రాంగం ఆటంకం కలిగిస్తోందని మల్కాజిగిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేవంత్​ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికారులు తెరాసకు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు లేఖలో ఆరోపించారు.

revanth

By

Published : Apr 8, 2019, 3:20 PM IST

కేంద్ర ఎన్నికల సంఘానికి మల్కాజిగిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేవంత్​ రెడ్డి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి అధికారులు ఆటంకం కల్గిస్తున్నారని లేఖలో తెలిపారు. స్థానిక అధికారులు తెరాసకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపించారు. ప్రచార వాహనాలను కుంటిసాకులతో అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ మద్దతుదారులను బెదిరిస్తున్నారని... తెరాసలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. 10 గంటల వరకు సమయం ఉన్నా 7 గంటలకే ప్రచారం ముగించాలంటున్నారన్నారు. ప్రచారానికి ఆటంకాలు కలుగకుండా సాఫీగా సాగేట్లు చూడాలని రేవంత్‌ రెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్​ రెడ్డి ఫిర్యాదు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details