నాసా శాస్త్రవేత్తలు కొత్తగా కనుగొన్న ఓ తోకచుక్క కనువిందు చేయనుందని బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్ డా.బి.జి.సిద్ధార్థ తెలిపారు. ఇవాళ్టి నుంచి దీన్ని స్పష్టంగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్చి 27న ఈ తోకచుక్కను కనుగొనగా దీనికి సీ 2020 ఎఫ్3 నియోవైజ్‌గా నామకరణం చేశారు. అప్పటికే ఇది పాలపుంత చుట్టూ పరిభ్రమణం చేయడం ఆరంభించింది. ఈ నెల 3న సూర్యునికి అత్యంత సమీపానికి వెళ్లి 43 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో చక్కర్లు కొట్టింది.
ఆకాశంలో కనువిందు చేయనున్న తోకచుక్క
ఇవాళ రాత్రి 7.40 గంటల సమయంలో 20 నిమిషాలపాటు ఆకాశంలో ఓ తోకచుక్క కనువిందు చేయనుంది. ఈ నెల 22, 23లలో భూమికి మరింత దగ్గరగా వస్తుందని, ఆ సమయంలో మరింత ప్రకాశవంతంగా కనిపించనుంది. ఈ తోక చుక్కను మార్చి 27 న నాసా కనుగొంది. దీనికి సీ 2020 ఎఫ్ 3నియోవైజ్‌గా పేరు పెట్టారు.
ఇవాళ్టి నుంచి సుమారు 20 రోజులపాటు ఈ తోకచుక్క భూమిచుట్టూ పరిభ్రమిస్తుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, శాస్త్రవేత్త రఘునందన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 7.40 గంటల సమయంలో 20 నిమిషాలపాటు ప్రకాశవంతంగా ఉన్న తోకచుక్కను చూడవచ్చని తెలిపారు. ఈ నెల 22, 23లలో ‘నియోవైజ్’ భూమికి మరింత దగ్గరగా వస్తుందని, ఆ సమయంలో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇది సుమారు ఐదు కిలోమీటర్ల పొడవు ఉండటం, భూమికి అత్యంత సమీపంగా రావడం వల్ల దీన్ని ఎటువంటి పరికరాలూ లేకుండా చూడవచ్చని వివరించారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు