ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన బాలికకు వరుసకు బాబాయ్ అయ్యే యువకుడు (25) గత జూన్ నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చాడు. ఓ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి బాలికకు ఇచ్చాడు. అనంతరం బాలిక స్పహతప్పి పడిపోగానే.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా.. ఆమెను నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీశాడు.
కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. బాలికపై బాబాయి అత్యాచారం...! - బాలికపై బాబాయి అత్యాచారం
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వరుసకు బాబాయ్ (25) అయిన ఓ యువకుడు 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడు నెలల క్రితం ఈ ఘటన జరగగా.. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే ఇటీవల బాలికకు వివాహం నిశ్చయమైన విషయం తెలిసి.. మీ అమ్మనాన్నలు కుదిర్చిన వివాహం చేసుకుంటే చంపేస్తానని, మన మధ్య జరిగింది చెబితే వారు ఆత్మహత్య చేసుకుంటారంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో భయాందోళనకు గురైన బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం దిశ విభాగం డీఎస్పీ మురళీమోహన్ గ్రామంలో కుటుంబసభ్యులను, బాధితురాలిని విచారించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: love fraud in hyderabad: మ్యాట్రిమోనీలో చూసి వలేశాడు.. ఆ వీడియోలు తీసి ఆన్లైన్లో...
TAGGED:
బాలికపై బాబాయి అత్యాచారం