జలకళతో ఉట్టిపడుతున్న మధ్యమానేరుబ్యాక్వాటర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. మొదటగా తంగళ్లపల్లి వంతెన వద్ద మానేరు బ్యాక్‌వాటర్ పరిశీలించారు. ఆ తర్వాత కేటీఆర్‌తో కలిసి మానేరునదిలో కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. వంతెనపైనే మానేరు నదికి జలహారతి పట్టారు. తొలి ఏడాదే మధ్యమానేరు ప్రాజెక్టు నిండి పరవళ్లు తొక్కడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు.
పూలతో ఘన స్వాగతం
ఉదయం ప్రగతి భవన్ నుంచి బస్సు (ప్రగతిరథం)లో బయల్దేరిన కేసీఆర్‌కు దారిపొడవునా పూలతో స్వాగతం పలికారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకున్నారు. కేసీఆర్, కేటీఆర్ దంపతులు రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.