తెలంగాణ

telangana

ETV Bharat / city

RGV Tweet: 'గుడివాడలో క్యాసినో.. కొడాలి నానిని మెచ్చుకోవాలి' - Goa Casino Comes To Gudivada

RGV Tweet: ఏపీలోని గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో జూదం నిర్వహించారన్న వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. గుడివాడ ఆధునికీకరణకు పాటు పడుతున్న నానికి తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఆర్జీవీ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

RGV Tweet: 'గుడివాడలో క్యాసినో.. కొడాలి నానిని మెచ్చుకోవాలి'
RGV Tweet: 'గుడివాడలో క్యాసినో.. కొడాలి నానిని మెచ్చుకోవాలి'

By

Published : Jan 19, 2022, 5:23 PM IST

RGV Tweet: ఏపీ మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌లో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకుల పర్యవేక్షణలో జూదం నిర్వహించారన్న విషయం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ స్పందించారు. గుడివాడ ఆధునికీకరణకు పాటు పడుతున్న నానికి తన పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. క్యాసినోకు వ్యతిరేకంగా వస్తోన్న విమర్శలు పట్టించుకోవద్దని అన్నారు.

‘‘గుడివాడ ఆధునికీకరణ, అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న కొడాలి నానికి నా అభినందనలు. ఆయనకు నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. క్యాసినోకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న వారిని పట్టించుకోవద్దు. పారిస్‌, లాస్‌వెగాస్‌, లండన్‌ వంటి దేశాల జాబితాలో గుడివాడను ఉంచేందుకు ప్రయత్నిస్తున్న నానిని మెచ్చుకోవాలి. గోవా సంస్కృతిని గుడివాడకు తీసుకువచ్చిన నానిని విమర్శిస్తున్న వాళ్లు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి.. గుడివాడ ప్రజలు గోవా వెళ్లగలరు కానీ గోవాలో నివసించేవాళ్లు గుడివాడ రారు.’’ అని ఆర్జీవీ ట్వీట్‌ చేశారు.

RGV Tweet: 'గుడివాడలో క్యాసినో.. కొడాలి నానిని మెచ్చుకోవాలి'

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details