తెలంగాణ

telangana

ETV Bharat / city

Ram Gopal Varma tweet : రామ్​గోపాల్​ వర్మ వివాదాస్పద ట్వీట్​పై ట్రోలింగ్ - Ram Gopal Varma tweet

Ram Gopal Varma tweet on Sex Love : రామ్​గోపాల్​ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రేమని, సెక్స్​ను కెమిస్ట్రీ, ఫిజిక్స్​తో పోలుస్తూ ట్వీట్​ పెట్టాడు. దీనిపై కామెంట్లు, ట్రోల్స్ రూపంలో వర్మకి సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

Ram Gopal Varma tweet
Ram Gopal Varma tweet

By

Published : Dec 8, 2021, 2:47 PM IST

వివాదాలు వైఫైలా చుట్టూ తిప్పుకునే సంచలన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ తాజాగా మరోసారి సామాజిక మాధ్యమాల్లో షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఉదయాన్నే లేచి పోర్న్ సినిమాలు చూస్తానని గతంలో చెప్పి షాకిచ్చిన వర్మ.. తాజాగా ప్రేమ, శృంగారానికి సంబంధించి బోల్డ్ కామెంట్‌ చేశారు. ప్రేమని, సెక్స్​ను కెమిస్ట్రీ, ఫిజిక్స్​తో పోలుస్తూ ట్వీట్​ పెట్టాడు. `ప్రేమ అనేది కెమిస్ట్రీకి సంబంధించినదని, కానీ సెక్స్ ఫిజిక్స్ కి సంబంధించినది` అని బోల్డ్​ ట్వీట్‌ చేసి మరోసారి వివాదానికి తెరలేపాడు.

వర్మ పోస్ట్​పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. నెటిజన్లు రెచ్చిపోతున్నారు. వర్మను మించిన కామెంట్లు చేస్తూ హీట్​ పెంచుతున్నారు. `అందులో లస్ట్ మ్యాథ్స్​కు సంబంధించినది కొలతలు పెడుతున్నారు. `మ్యారేజ్‌ కామర్స్​కు సంబంధించినది` అని, విడాకులు అనేది అన్నింటికి సంబంధించిన ఆర్ట్స్ అని, ప్రెగ్నెన్సీ బయోలజీ అని అంటూ కామెంట్లు, ట్రోల్స్ రూపంలో తెలియజేస్తూ వర్మకి సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

రామ్‌గోపాల్‌ వర్మ.. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన `డేంజరస్‌`, `12 o clock` అనే హర్రర్‌ సినిమా, `లడ్కీ` మూవీ, `కొండా` అనే సినిమాలను రూపొందిస్తున్నారు. `కొండా` మూవీ కొండా సురేఖ, కొండా మురళీ జీవితాల ఆధారంగా రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ నుంచి మరో సాంగ్​ రిలీజ్​

ABOUT THE AUTHOR

...view details