RAM GOPAL VARMA: సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తా.. కానీ..! - RAM GOPAL VARMA interesting comments on kcr biopic
19:08 March 31
RAM GOPAL VARMA: సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తా.. కానీ..!
ఎప్పుడూ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలిచే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. మరోసారి వార్తల్లోకెక్కారు. వర్మ కొత్త సినిమా 'డేంజరస్' చిత్ర ట్రైలర్ రిలీజ్ వేడుకలో భాగంగా సీఎం కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో నిర్వహించిన ఈ వేడుకలో కచ్చితంగా సీఎం కేసీఆర్ బయోపిక్ తీస్తానని వర్మ ప్రకటించారు. కేసీఆర్ బయోపిక్ తీస్తారా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'కచ్చితంగా తీస్తా.. కానీ దానికి ఇంకా సమయం పడుతుంది. బయోపిక్ చిత్రాలు ఊరికే రావు.. వాటి వెనకాల చాలా రీసెర్చ్, కృషి ఉంటుంది.' అని వర్మ వెల్లడించారు.
ఇటీవల వర్మ తీస్తున్న సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. తాజాగా వర్మ తీసిన 'డేంజరస్' సినిమా విడుదలకు రెఢీ అవుతోంది. ఈ సినిమాలో అప్సరా రాణి, నైనా గంగూలి ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇదీ చూడండి: సామ్-నయన్ సందడి.. కృతి సనన్ చెల్లితో రవితేజ రొమాన్స్!
TAGGED:
RAM GOPAL VARMA