RAM CHARAN: రెండేళ్ల తర్వాత భార్యతో కలిసి రామ్‌చరణ్..! - upasana
11:53 March 07
RAM CHARAN: రెండేళ్ల తర్వాత భార్యతో కలిసి రామ్‌చరణ్..!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్-దర్శకుడు శంకర్ కలయికలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న చిత్రం తెలిసిందే. అయితే ఈ చిత్ర షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు చెర్రీ. తన భార్య ఉపాసనతో కలిసి సుమారు రెండేళ్ల తర్వాత వెకేషన్‌కు వెళ్లారు. ఈ మేరకు ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పంచుకున్నారు. "ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత వెకేషన్‌కి వెళ్తున్నాం. థాంక్యూ మిస్టర్ సీ" అని ఉపాసన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్-ఎన్టీఆర్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.