కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్ వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు - rainfall in telangana
కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
వేసవి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమవారం గోధూరు(జగిత్యాల జిల్లా)లో 42.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సిరిపురం(ఖమ్మం జిల్లా)లో 42.3, నిజామాబాద్లో 40.9, భద్రాచలంలో 40.6, ఆదిలాబాద్లో 40.3, రామగుండంలో 39.4, హైదరాబాద్లో 38.2 డిగ్రీలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. వేసవి ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. అత్యల్పంగా రామగుండంలో 24, హైదరాబాద్లో 24.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి.