ఉదయం నుంచి మండుటెండతో ఇబ్బంది పడ్డ నగర ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, సోమాజీగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది.
హైదరాబాద్‌లో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం - telangana varthalu
సూర్యుడి ప్రతాపానికి కాస్త ఉపశమనం లభించింది. ఉదయం నుంచి ఎండలు మండుతుండగా.. మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షానికి వాతావరణం కాస్త చల్లబడింది.
హైదరాబాద్‌లో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం
ఈ ప్రాంతాలతో పాటు కూకట్‌పల్లి, హైదర్‌నగర్, బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్రగతినగర్, నిజాంపేట్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్‌లో చిరుజల్లులు కురిశాయి. వాహనదారులు కాస్త ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఇదీ చదవండి: 'అద్దెలు పెరిగింది హైదరాబాద్‌లో మాత్రమే!'