తెలంగాణ

telangana

ETV Bharat / city

అల్పపీడన ప్రభావం... ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా.. ఈనెల 25, 26న ఏపీలో తేలిక పాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

weather
weather

By

Published : Nov 22, 2020, 7:39 PM IST

ఏపీలో నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణం శాఖ తెలిపింది.

తదుపరి 24 గంటలలో తుపానుగానూ పరిణమించవచ్చని పేర్కొంది. ఫలితంగా ఈనెల 25, 26న ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమందని ప్రకటించింది.

ఇదీ చదవండి:వరదసాయం పేరుతో తెరాస నేతలు దోచుకున్నారు: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details