అమరావతే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతి రాజధాని కొనసాగింపు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని సవాల్ విసిరిన విషయాన్ని గుర్తు చేశారు. తన ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోందని చెప్పారు.
అమరావతి కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలి: రఘురామ - అమరావతి ఉద్యమానికి రఘురామకృష్ణరాజు మద్దతు తాజా వార్తలు
300 రోజులుగా అమరావతి ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో ఇకపై రెట్టించిన ఉత్సాహంతో ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని రైతులకు ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి.. ప్రచారం చేస్తూ.. కొందరు ఉన్నాదుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపట్టాలి: రఘురామ