నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. హైకోర్టు సూచన మేరకు ఆయనను గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్ రిపోర్టును జడ్జికి అందజేశారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి.
పోలీసులు నన్ను కొట్టారు..: ఎంపీ రఘురామకృష్ణరాజు
18:05 May 15
పోలీసులు నన్ను కొట్టారు..: ఎంపీ రఘురామ
రఘురామపై సీఐడీ అధికారులు పెట్టిన సెక్షన్లు వర్తించవని, రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఆ సెక్షన్లను రద్దుచేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించినట్టు సమాచారం. అయితే, రఘురామ కృష్ణరాజు తరఫు న్యాయవాదులు సీఐడీ కోర్టులో బెయిల్ పిటిషన్‌తో పాటు అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. తనను పోలీసులు కాళ్లు వాచిపోయేలా కొట్టారని, నిన్న రాత్రి వేధింపులకు గురిచేశారంటూ రఘురామకృష్ణరాజు జడ్జికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదును న్యాయమూర్తికి అందజేసినట్టు సమాచారం.
మరోవైపు, ఇప్పటికే రఘురామ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు ఓ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. కింది కోర్టులోనే బెయిల్ కోసం సంప్రదించాలని సూచించింది. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై రిమాండ్ రిపోర్టును సిద్ధం చేసి సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కోర్టు ఆవరణలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
ఇదీ చూడండి: కింద కోర్టుకు వెళ్లాలని రఘురామకు.. హైకోర్టు సూచన