రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే 12 శాతం నేరాలు తగ్గినట్టు... కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని వార్షిక నేర నివేదిక ఇవాళ విడుదల చేశారు. సీసీఎస్‌లో 229 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా... రూ.3.86 కోట్లు రికవరీ చేసినట్టు తెలిపారు. ఎస్వోటి విభాగంలో 892 కేసులు నమోదు కాగా... రూ.5.95 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. నమోదైన కేసుల్లో 51 శాతం నిందితులకు శిక్షలు పడగా... 5,548 కేసులుల లోక్ అదాలత్‌లో పరిష్కరించినట్టు వెల్లడించారు. నలుగురు చెడ్డీ గ్యాంగ్ నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష విధించి, 82 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్టు వివరించారు.
ఇయర్ రిపోర్ట్: నేరాలు తగ్గాయ్.. శిక్షలు పెరిగాయ్: మహేశ్ భగవత్ - రాచకొండ కమిషనరేట్ పరిధిలో నేర నివేదిక
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నేరాల వార్షిక నివేదికను... సీపీ మహేశ్ భగవత్ విడుదల చేశారు. గతేడాది కంటే 12 శాతం నేరాలు తగ్గినట్టు తెలిపారు. 51 శాతం మంది నిందితులకు శిక్షలు పడగా.. 82 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్టు వెల్లడించారు.
ఇయర్ రిపోర్ట్: నేరాలు తగ్గాయ్.. శిక్షలు పెరిగాయ్: మహేశ్ భగవత్
రాచకొండ పరిధిలో 704 సైబర్ క్రైమ్ కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 12 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి... 136 కేసులను వాటి సాయంతోనే పరిష్కరించినట్టు చెప్పారు. సామాజిక మాధ్యమాల 4,926 ఫిర్యాదులు, డయల్ 100కి 1.66 లక్షల కాల్స్ వచ్చినట్టు వివరించారు. 2,525 మంది తప్పిపోగా... 2,233 మందిని గుర్తించినట్టు పేర్కొన్నారు. షీ టీమ్‌ల ఆధ్వర్యంలో 23 బాల్యవివాహాలను అడ్డుకున్నట్టు వివరించారు.