రేపు ఉప్పల్ వేదికగా భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరగనున్న టీ-20 కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మెుత్తం 1800 మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం షీ-బృందాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.
ఉప్పల్ టీ-20కి 1800 మంది పోలీసులతో భద్రత - bharath-west indies
రేపు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే టీ-20 కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఇప్పటివరకు 24వేల టికెట్లు అమ్ముడుపోయాయని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ తెలిపారు.
ఉప్పల్‌లో జరిగే టీ-20 కోసం భారీ బందోబస్తు
స్టేడియం చుట్టూ మెుత్తం 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని మ్యాచ్‌కోసం ప్రాక్టీసు చేస్తున్నారని సీపీ తెలిపారు. బయటి నుంచి ఇతర తినుబండారాలను లోపలకి అనుమతించమని చెప్పారు.
ఇవీ చూడండి: ధోనీ రికార్డుపై కన్నేసిన రిషభ్ పంత్