తెలంగాణ

telangana

ETV Bharat / city

PV Sindhu: త్వరలో విశాఖ అకాడమీలో శిక్షణ ఇస్తా - ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న పీవీ సింధు

ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు సింధుకు ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందించారు. అనంతరం సీఎం జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు.

pv-sindu-visits-durgamma-temple-in-vijayawada
pv-sindu-visits-durgamma-temple-in-vijayawada

By

Published : Aug 6, 2021, 1:05 PM IST

ఒలింపిక్‌ పతక విజేత, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు సింధుకు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఆమెకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఒలింపిక్స్‌కు వెళ్లేముందు దుర్గమ్మను దర్శించుకున్నానని.. అమ్మవారి ఆశీస్సులతో పతకం గెలిచానన్నారు. దుర్గమ్మ దర్శనానికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. 2024 ఒలింపిక్స్‌ సహా భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు ఆడాల్సి ఉందన్నారు.

ఏపీ ప్రభుత్వం చర్యలు సంతోషదాయకం

దుర్గమ్మ దర్శనం అనంతరం ఏపీ సీఎం జగన్‌ను పీవీ సింధు కలిశారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధును సీఎం అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు వెళ్లేముందు పతకంతో తిరిగి రావాలని సీఎం ప్రోత్సహించారని తెలిపారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని పతకాల సాధనకు అవకాశం కలుగుతుందన్నారు. విశాఖలో తన అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని.. త్వరలోనే ఏర్పాట్లు పూర్తి చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని సింధు చెప్పారు.

ఇదీ చదవండి:పోస్టుల వర్గీకరణ పూర్తిచేసిన రాష్ట్ర ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details