తెలంగాణ

telangana

ETV Bharat / city

లాల్‌దర్వాజ అమ్మవారికి బోనం సమర్పించిన పీవీ సింధు - బోనమెత్తిన పీవీ సింధు

PV Sindhu at Lal Darwaza bonalu : భాగ్యనగరంలో లాల్​దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం కన్నులపండువగా జరుగుతోంది. అమ్మవారికి దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు మొదటి బోనాన్ని సమర్పించారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బోనాల పండుగలో పాల్గొంది. స్వయంగా బోనమెత్తి అమ్మకు నైవేద్యం పెట్టారు.

PV Sindhu at Lal Darwaza bonalu
PV Sindhu at Lal Darwaza bonalu

By

Published : Jul 24, 2022, 9:36 AM IST

PV Sindhu at Lal Darwaza bonalu : హైదరాబాద్‌ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మొదటి బోనాన్ని దేవేందర్ గౌడ్ కుమారుడు, కోడలు సమర్పించారు. స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొంది. అమ్మవారికి ఆమె బోనం సమర్పించింది. ప్రతి ఏటా అమ్మవారికి బోనం సమర్పించే సింధు.. గత ఏడాది మాత్రం టోర్నమెంట్‌ కారణంగా రాలేకపోయింది. ఈసారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. సింధును ఆలయ కమిటీ సత్కరించింది.

"నాకు హైదరాబాద్ బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. ప్రతి ఏటా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటాను. కానీ గతేడాది బోనాల సమయంలో పోటీల వల్ల రాలేకపోయాను. ఈసారి అమ్మకు బంగారు బోనం సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి తప్పకుండా ప్రతియేడు బోనాల ఉత్సవంలో పాల్గొంటాను." - పీవీ సింధు, భారత స్టార్ షట్లర్

మరోవైపు.. లాల్‌దర్వాజా అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ పెరగడంతో గంటలపాటు క్యూలో వేచి చూస్తున్నారు. మైనంపల్లి కుటుంబ సభ్యులు కూడా లాల్​దర్వాజ బోనాల పండుగలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా కలిసి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details